- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

జనసేన నాయకులు వరుస విభాగాలలో చిక్కుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న విషయాలకు కూడా చూస్తున్నాం. జనసేన అంటే నిబద్ధతకు .. ప్రజాసేవకు ప్రశ్నించే తత్వానికి కీలకం అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప‌లు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. అనూహ్యంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని పార్టీ అధినేతను కూడా ఇరుకున పడేలా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎవరూ క్రమశిక్షణ తప్పకుండా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్న నాయకులలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. గతంలో పార్టీకి బలమైన వాయిస్ వినిపించి ఎన్నికల సమయంలో జనసేన ప్రచార గీతాలు పైలెట్ అవటంలో కీలకపాత్ర పోషించిన జానీ మాస్టర్ తర్వాత కలంలో లైంగిక వేధింపులు కేసులు ఎదుర్కొన్నారు.


ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీ నుంచి తప్పించారు. ఆయన బయటకు వచ్చిన జనసేనకు దూరంగా ఉన్నారు. జనసేన కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. తర్వాత పిఠాపురంలోనే ఓ బాలికపై జనసేన కార్యకర్త ఒకరు లైంగిక దాడికి పాల్పడటం కేసులు పెట్టడం జరిగాయి. తాజాగా శ్రీకాళహస్తి ఇన్చార్జి కోట వినుత‌ విషయం పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆమె కూడా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైంది. ఇక కొవ్వూరు జనసేన ఇంచార్జ్ టీవీ రామారావు కూడా పార్టీ క్రమశిక్షణ తప్పి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ ఆయనను కూడా పార్టీ నుంచి తప్పించారు. ఇలా జనసేన నేతలు వరుస పెట్టి ఏదో ఒక వివాదాలలో చిక్కుకుంటూ పార్టీకి మైనస్ గా మారారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: