గత కొన్నేళ్లలో ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ఎంత కష్టపడినా వ్యవసాయంలో సానుకూల ఫలితాలను అందుకోవడం కష్టమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులు జమ కాకపోవడం రైతులను బాధ పెడుతోంది. ఈ నెల 18వ తేదీన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు జమవుతాయని రైతులు భావించడం జరిగింది.

అయితే రైతుల ఖాతాలలో నేటికీ  ఆ నగదు జమ కాకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.  రైతుల ఖాతాలలో నగదు ఎప్పుడు జమవుతుందనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  యోజన పథకం ఆలస్యం కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

 ఆగస్టు మొదటి వారంలో  ఈ పథకం నిధుల  జమ జరిగే ఛాన్స్ ఉందని  పొలిటికల్  వర్గాల్లో వినిపిస్తోంది. అప్పటివరకు రైతులకు మాత్రం  ఎదురుచూపులు తప్పవని  తెలుస్తోంది.  రైతుల డేటా పరిశీలన ఆలస్యం  కావడంతో ఈ స్కీమ్  అమలు ఆలస్యం అవుతోందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఏ ఒక్కరూ  అర్హత కోల్పోకుండా చూడాలని  ప్రభుత్వం భావిస్తోందని  తెలుస్తోంది.

ఆధార్ బ్యాంక్ ఖాతా లింకింగ్ సమస్యలు,  ఈ కేవైసీ పూర్తీ చేయకపోవడం,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపాలు  ఈ పథకం అమలు ఆలస్యానికి  కారణమవుతున్నాయి.  రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా  ఈ స్కీమ్  కు అర్హత  పొందవచ్చు.   డబ్బులు క్రెడిట్ కాకపోతే   బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేయడంతో పాటు  లోపాలను సరి చేసుకోవాలి. ఈ పథకం గురించి ఏవైనా సందేహాలు ఉంటే  హెల్ప్ లైన్ ను  సంప్రదించడం ద్వారా పూర్తీ వివరాలను తెలుసుకోవచ్చు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: