ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  ముఖ్యంగా మహిళలకు ప్రతినెల రూ.1500 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద అందజేస్తామంటూ చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతూ ఉన్న ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో చాలామంది మహిళలు అసహనాన్ని తెలుపుతున్నారు. అయితే ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజున విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఉండే మంగళపాలెంలో  నిర్వహించినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరైన ఈ మంత్రి సంక్షేమ పథకాల గురించి అడిగిమరి తెలుసుకున్నారు.


మంగళపాలెంలో నిర్వహించినటువంటి సభలో  అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీలలో అన్నిటినీ కూడా తాము అమలు చేశామని కానీ ఒక్క పథకం మాత్రం మిగిలిపోయింది అంటూ అది ఆడవాళ్లకు ప్రతినెల రూ .1500 రూపాయలు ఆడబిడ్డ నీది పథకం కింద ఇస్తామన్నాము అది చేయాలి అంటే ఏపీని అమ్మాలని.. దీనిపైన ఇంకా ఆలోచన చేస్తున్నామంటూ తెలిపారు.


ఈ పథకం అమలు చేయాలి అంటే అంత డబ్బు అవసరం ఉంటుందనే విషయాన్ని తెలిపారు. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే విషయంపై కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిపారు అచ్చెన్నాయుడు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రకటించిన పథకం 2024 లో కూటమి గెలుపుకి చాలా కీలకంగా అప్పట్లో మారింది. కానీ కూటమి గెలిచిన తర్వాత ఇలా మాట్లాడడం చర్చనీయాంశమైంది. మరి ఈ విషయం పైన సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలియజేశారు.  మరి ఆడబిడ్డ నిధి పథకంపై ఏదైనా గుడ్ న్యూస్ తెలియజేస్తారేమో చూడాలి. ఇదివరకే సీఎం చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ హామీలను ఇచ్చేశామంటూ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: