
రాష్ట్ర విద్యారంగంలో దశాబ్ధాలుగా వేళ్లూనుకున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను సవాల్ గా స్వీకరించిన లోకేష్ గత ఏడాదికాలంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు అనునిత్యం పడుతున్న ఇబ్బందులను వివిధ ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న లోకేష్ ... వారి సమస్యల శాశ్వత పరిష్కారానికి నడుం కట్టారు. గిరిజన ప్రాంతాలలో నూరు శాతం శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
మంత్రి నారా లోకేష్ చొరవ తో మారుమూల ప్రాంతమైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 45.02 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా జి.ఓ నెం.264 ని విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు భవనాలు లేని , పూర్తిగా నూతన భవనాలు అవసరమైన 286 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి మరియు 85 పాఠశాలల్లో మేజర్ , మైనర్ మరమ్మతుల కోసం మొత్తంగా రూ. 45.02 కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశాలు జారీచేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల పై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఏదేమైనా లోకేష్ ఈ సవాల్ లో విజయవంతంగా గెలిచాడనే ప్రశంసలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు