
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్రంలో జనసేనతో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తో సైతం చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. జగన్ మాత్రం రాహుల్ గాంధీ ఏపీ పేరును ప్రస్తావించలేదని కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. జగన్ లో ఇప్పటికీ మార్పు వచ్చే ఛాన్స్ లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
మరోవైపు పులివెందులలో దొంగ ఓట్లకు సంబంధించిన ప్రస్తావన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు నిజమైన ఫోటోలే అని ఆధారాలతో సహా తేలిపోయింది. జగన్ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్లను దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ తన చుట్టూ ఉండే సలహాదారులను మార్చుకోవాలని ఆ విషయంలో మారితే జగన్ కు పూర్వ వైభవం రావడం మరీ కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. సరైన దిశలో అడుగులు వేస్తె మాత్రమే వైసీపీకి మళ్ళీ అధికారం దక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు