
అందులో ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ.. దీనిని పోస్టల్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆఫర్లను ప్రకటించింది. స్కీమ్ పాలసీదారులకు పూర్తిగా బెనిఫిట్ విషయానికి వస్తే.. ఏడాదికి రూ.549 రూపాయలు అంటే సుమారుగా రోజుకి రూ.1.50 పైసలు ఖర్చుతో రూ .10 లక్షల రూపాయల వరకు కవరేజ్ చేస్తుంది.. అయితే ఇది పోస్టల్ యాక్సిడెంట్ స్కీమ్ కి మాత్రమే వర్తిస్తుంది. రోజుకి రెండు రూపాయలు ఖర్చు అంటే 15 లక్షల రూపాయల వరకు కవరేజ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏడాది ప్రీమియం 749 రూపాయలలో చెల్లించాలి.
వాస్తవానికి ఈ ఖర్చు రోజుకి కేవలం చాక్లెట్ కంటే కూడా తక్కువ మోతాదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు అర్హులుగా ప్రకటించారు.. ఈ స్కీమ్ కింద ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం, పాక్షికంగా లేదా పూర్తిగా వైకల్యానికి ఈ భిమా కవరేజ్ లభిస్తుందని తెలియజేశారు. అలాగే ప్రమాద సమయంలో odp వైద్యుల ఖర్చులకోసం 30 వేల రూపాయలు అందిస్తారట. అలాగే ఆస్పత్రిలో అడ్మిషన్ కావాల్సిన పని లేకుండా రూ. 1500 రూపాయల వరకు కన్సల్టెంట్ ఉంటుందట. ఒకవేళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే రూ.60 వేల రూపాయల వరకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కీమ్ కింద బాధితుడు పిల్లల విద్య కోసం గరిష్టంగా ఒక లక్ష రూపాయల వరకు అందిస్తుందట పోస్టల్ డిపార్ట్మెంట్. వీటికి తోడు వ్యక్తికి ప్రమాదంలో ఎముకలు విరిగిన కోమాలోకి వెళ్లిన లక్ష రూపాయలు అందిస్తారు. ఇదే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద.