ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధానుల ఫోటోలు పెట్టే విషయంలో ఒక వివాదం రాజుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టినందుకు గానూ ఒక వ్యక్తి కోర్టు కు వెళ్లారు. దీనిపై విచారణ జరిపినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఇందులో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. రాజకీయ దృష్టితోనే ఉద్దేశపూర్వకంగా పిటిషన్ దాఖలు అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసింది. 

ఈ విధంగా సమాజానికి మేలు చేసే పిటిషన్లపై మాత్రమే కోర్టు 15 రోజులకి ఒకసారి తీసుకుంటుందని ఇలా సమాజానికి ఏమాత్రం మేలు లేని వాటిపై హైకోర్టు పట్టించుకోదని చెప్పేసింది.. మీ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కోర్టులను మార్చే ప్రయత్నం చేస్తే మంచిది కాదని హెచ్చరించింది. అయితే ఇదే విషయంపై  రైల్వే విశ్రాంత ఉద్యోగి వై కొండలరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సచివాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం చిత్రపటం తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఇంకా స్పందించలేదు. అయితే ఈ ఫోటోల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఒక విషయం బయటపెట్టింది.

 రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులు పొందిన వారి ఫోటోలు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇందులో ముఖ్యమంత్రిది రాష్ట్రపతి,ప్రధానమంత్రి ఉండవచ్చు. ఇక వేరే వాళ్లది ఉండడానికి వీలు లేదని అన్నది. కట్ చేస్తే..ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా డిప్యూటీ సీఎం అయినా సరే రాజ్యాంగబద్ధంగానే ఎన్నుకోబడిన వ్యక్తులే. వీరిని ప్రజలు ఎన్నుకోకుండా మిగతా వాళ్లయితే ఎన్నుకోలేదు. రాజ్యాంగ నియమాల ప్రకారం వీరు ప్రజలతో ఎన్నుకోబడి పదవులు పొందారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఏమి ఇస్తుంది అనేది ముందు ముందు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: