
విజయవాడ ఉత్సవాన్ని అడ్డుకునేందుకు వైసిపి నేతలు ఎన్నో కుట్రలు పన్నారు. దుర్గమ్మ ముందు వైసీపీ నేతలు కుట్రలు సాగలేదు. 55 రోజుల కోసం ప్రభుత్వం దేవాదాయ భూమిని రూ .44 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకున్నారు వీటి పైన కూడా వైసిపి కుట్రలు ,కుతంత్రాలతో విషం చిమ్ముతోంది అంటూ వైసీపీ పైన ఆరోపణలు చేశారు ఎంపీ చిన్ని. వారు ఈ విషయం మీద కోర్టును కూడా ఆశ్రయించారు.. దేవినేని అవినాష్, పేర్ని నాని కొంతమంది వైసీపీ నేతలు విజయవాడ ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు.
విశ్వహిందూ పరిషత్ పేరుతో పేర్ను నాని అనుచరులు కోర్టులో తప్పుడు పిటిషన్ వేశారని.. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ పిటిషన్ వేశారు.. ఇది చాలా దుర్మార్గపు చర్య ?ఎవరి ప్రభుత్వ హయాంలో భూములు అక్రమంగా దోచుకున్నారో అందరికీ తెలుసు? గోడౌన్లలో బియ్యం మాయం చేసిన వ్యక్తి పేర్ని నాని. మాజీ మంత్రి వెల్లంపల్లి హయాంలో దుర్గమ్మ గుడిలో ఉండే వస్తువులు మాయమయ్యాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే దుర్గమ్మ ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామంటు తెలిపారు ఎంపీ చిన్ని. ఎన్నో ఫోర్జరీ సంతకాలు చేసిన అవి చెల్లుబాటు కాలేదు చివరికి ఎన్నో దుర్మార్గాలను ఎదిరించి తమ విజయం సాధించామంటూ తెలిపారు ఎంపీ చిన్ని. విజయవాడ నగర అభివృద్ధి నా జయం అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. అలాగే రెడ్ బుక్ 2.o మొదలుపెట్టాలని లోకేష్ ని రిక్వెస్ట్ చేస్తున్నామని తెలిపారు.