టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. తన ఎనర్జీ, టైమింగ్, పంచ్ డైలాగ్‌లు, కామెడీ టచ్‌తో ఆయనకున్న క్రేజ్ వేరేలా ఉంటుంది. రవితేజ కెరీర్‌లో మరో విశేషం ఏమిటంటే – ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరు వచ్చినా, వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీని ఏలిన నయనతార, త్రిష, అనుష్క, కాజల్, ఇలియానా, శ్రుతి హాసన్, రాశిఖన్నా లాంటి హీరోయిన్‌లందరితో రవితేజ తనదైన స్టైల్లో జంట కట్టాడు.


అనుష్క – విక్రమార్కుడు, బలాధూర్ .. రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడులో రవితేజఅనుష్క జంట సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీ బ్లాక్‌బస్టర్. తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన బలాధూర్ మాత్రం పెద్దగా నడవలేదు. నయనతారదుబాయ్ శీను, ఆంజనేయులు .. ‘లేడీ సూపర్ స్టార్’ నయనతారతో రవితేజ రెండు సినిమాలు చేశాడు. దుబాయ్ శీను మంచి హిట్ కాగా, ఆంజనేయులు మాత్రం కలెక్షన్ల పరంగా అంతగా రాణించలేదు. కానీ రవితేజ – నయన్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.



త్రిష – కృష్ణ .. త్రిషతో చేసిన కృష్ణ సినిమా రవితేజ కెరీర్‌లో మరో సూపర్ హిట్. ఈ సినిమాలో రవితేజ మార్క్ ఎనర్జీ, త్రిష గ్లామర్ బాగా కలిసిపోయాయి. ఇప్పటికీ ఈ సినిమా రవితేజ అభిమానులకు ఫేవరెట్. కాజల్ – సారొచ్చారు, వీర .. గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్‌తో సారొచ్చారు, వీర సినిమాల్లో నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, రవితేజకాజల్ కాంబో ఫ్యాన్స్‌కి బాగానే నచ్చింది. శ్రుతి హాసన్ – బలుపు, క్రాక్ .. రవితేజ – శ్రుతి కాంబో అయితే మాస్ ఆడియన్స్‌కి ప్రత్యేకమైన ట్రీట్. బలుపు భారీ హిట్ కాగా, క్రాక్తో రవితేజ తిరిగి తన సత్తా చాటాడు. ఈ సినిమాలు రవితేజ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.



రాశిఖన్నా – బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు .. యంగ్ బ్యూటీ రాశిఖన్నాతో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాలు చేశాడు. బెంగాల్ టైగర్ బాగానే ఆడినా, టచ్ చేసి చూడు బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. మాస్ మహారాజా కొనసాగుతున్న స్టామినా .. గత రెండు దశాబ్దాలుగా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ఫ్యాన్స్‌లో అదే ఉత్సాహం కొనసాగుతోంది. మొత్తం మీద.. స్టార్ హీరోయిన్ ఎవరు వచ్చినా వారితో కాంబో ఇచ్చిన హీరో రవితేజే. అందుకే ఆయనకు “మాస్ మహారాజా” అనే టైటిల్ సరిపోయేంతగా క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: