
మొదటి భాగంలో కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో, వాటిని దృష్టిలో పెట్టుకుని దేవర 2 మరింత పర్ఫెక్ట్‌గా ఉండేలా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు సమాచారం. ముఖ్యంగా కథనాన్ని కుదించి, ఎమోషనల్ కనెక్ట్ పెంచే విధంగా మార్పులు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్‌కుమార్ చిత్రాలు లైన్‌లో ఉన్నా వీరిద్దరి ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. కానీ, కొరటాల శివకే ఎక్కువ సమయం సిద్ధంగా ఉండటంతో, దేవర 2 ముందుగా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన 2027 ఫస్ట్ హాఫ్‌లోనే దేవర 2 విడుదల అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. భారీ సెట్స్ రెడీగా ఉన్నందున, హీరోతో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ వంటి నటీనటుల డేట్స్ ఫైనలైన వెంటనే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మొదటి భాగంలో వచ్చిన సజెషన్స్, విమర్శలు మళ్లీ రాకుండా ఈసారి కథను మరింత బలంగా మలిచేందుకు యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మొత్తం మీద, దేవర 2 అప్‌డేట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపబడింది. ఇప్పటికే గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్, సీక్వెల్ సినిమాతో మరింత శక్తివంతంగా తిరిగి రాబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు. 2027లో దేవర 2 విడుదలైతే, అది ఎన్టీఆర్ కెరీర్‌లో మరో హిస్టారిక్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.