టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు  అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది వరకే బాలయ్య , గోపీచంద్ కాంబో లో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలయ్య , గోపీచంద్ కాంబో లో రాబోయే రెండవ సినిమాపై కూడా బాలకృష్ణ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే బాలయ్య , గోపీచంద్ తో చేయబోయే సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ దర్శకుడితో బాలయ్య మూవీ ఇప్పట్లో ఉంటుంది అని చాలా మంది ఊహించి ఉండరు.

ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు కొరటాల శివ. టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కోట కొరటాల శివ తన తదుపరి మూవీ ని బాలయ్య తో  చేయబోతున్నట్లు ప్రస్తుతం అందులో భాగంగా బాలయ్యతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 1 మూవీ ని రూపొందించాడు. ఇక ఈయన దేవర పార్ట్ 2 మూవీ ని కొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈయన మొదట బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: