తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ దళపతి నిర్వహించిన ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా దాదాపు 41 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర విషాదంలో పదిమంది చిన్నారులు, 22 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తుంది. మరికొందరి గుర్తింపు పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరణాలు 41కి పైగా నమోదవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, వెంటనే వాటర్ బాటిల్స్ అందించే ప్రయత్నం చేశారు. కానీ కొంతసేపట్లోనే పరిస్థితి అదుపు తప్పింది. ఆక్సిజన్ అందక చాలామంది కుప్పకూలిపోయారు. భారీ జనసంద్రహాన్ని పోలీసులు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు.అంబులెన్సులు  కష్టపడి అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరిగిపోయింది.



దీనిపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మహా విషాద ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో తక్షణ సహాయ చర్యలకు ఆదేశించామని వెల్లడించారు. అలాగే, రిటైర్డ్ జడ్జి అరుణ్ జగదీష్ నేతృత్వంలో ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు.విజయ్ అరెస్టుపై ప్రశ్నించగా, రాజకీయంగా స్పందించకపోవడమే మంచిదని, ప్రస్తుతానికి ప్రజలకు సేవ చేయడం ముఖ్యం అని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయ్ దళపతి అరెస్టు అవుతారో లేదో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున మీటింగులు, ర్యాలీలు నిషేధించాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను సభలకు తీసుకురావొద్దని బోర్డులు పెట్టాలని కూడా కోరుతున్నారు. సీఎం స్టాలిన్ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: