
టెన్సెసీ రాష్ట్రంలో జరిగిన ఈ పేలుడు ఆ ప్రాంతాన్ని, అక్కడ ఉండే స్థానికులను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా శబ్దం చాలా పెద్దగా వినిపించిందని దగ్గరలో ఉండే ఇల్లు, వాహనాలు అన్ని కూడా కంపించాయని, భూమి సైతం కంపించడంతో భూకంపం వచ్చిందేమో అని భయంతో అక్కడ స్థానికులు భయపడిపోయామని తెలియజేస్తున్నారు. భయంతో జనం మొత్తం ఇంట్లో నుంచి పరుగులు తీశామని తెలుపుతున్నారు. కాని ఆ తర్వాత అది ప్లాంట్ లో పేలుడు అని తెలియడంతో కుదుటపడ్డారు.
టెన్సెసీ పేలుడు ఘటనకు నిన్నటి రోజున ఉదయం 7:45 సమయంలో సంభవించగా వెంటనే అక్కడికి సహాయక సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నాలు చేయగా మళ్లీ పెళ్లిళ్లు సంభవించాయి. అయితే ఈ పేలుళ్లు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ పేలుళ్లకు కారణాలను ఇంకా తెలియడంలేదని FBI అధికారులు ఈ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ప్రత్యేకించి మరి దర్యాప్తు చేస్తున్నట్లు హాంఫ్రిస్ ఫెరీష్ క్రిష్ డేవిస్ తెలిపారు. ఆక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టం కర్మాగారంలో ఈ బాంబు పేలుడు జరిగిందని ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణకు సంబంధించి పనులు జరుగుతూ ఉంటాయని తెలియజేస్తున్నారు.