
అసిస్టెంట్ మెకానిక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు, డిపో మేనేజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతులు నిలిచిపోయినట్లు తెలిపారు. స్త్రీశక్తి పథకం అమలు వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. కానీ బస్సులు తక్కువ, సిబ్బంది మరీ తక్కువ. డ్రైవర్లు, కండక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. బస్సుల్లో కొన్నిసార్లు దాడులు కూడా జరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే భద్రతా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఆగస్టు 28న సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జిఏడి శాఖలో ఫైలు ఇంకా పెండింగ్‌లో ఉందని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల కృషిని గుర్తించాలి.
స్త్రీశక్తి పథకం విజయవంతం కావడంలో మేము కీలక పాత్ర పోషించాం” అని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఒకవైపు మహిళల ఉచిత ప్రయాణ పథకం విజయవంతం చేయాలి, మరోవైపు ఆర్టీసీ సిబ్బందిని సంతృప్తి పరచాలి. రెండు పనులు సమాంతరంగా చేయడం సవాల్‌గా మారింది. ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఈ పథకం భవిష్యత్తును నిర్ణయించనుంది.స్త్రీశక్తి పథకం విజయవంతంగా సాగుతున్నా, దాని వెనుక ఉన్న ఆర్టీసీ సిబ్బంది సమస్యలు మళ్లీ ఎజెండాపైకి వచ్చాయి. ప్రభుత్వం సమయానుకూలంగా స్పందిస్తే పథకం బలం పెరుగుతుంది — లేకపోతే దీపావళి తర్వాత ఆర్టీసీ బస్సుల్లో “ఉచిత ప్రయాణం” కంటే “ఉద్యోగుల ఆందోళన” ఎక్కువగా కనిపించే ప్రమాదం ఉంది!