
ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్న అసలు హీరో ఎవరో తెలుసా? - నారా లోకేష్ :
గత సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… లోకేష్ అమెరికా పర్యటనకు బయల్దేరారు. ఐటీ రంగంపై స్పష్టమైన దృష్టి పెట్టిన ఆయన, నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయ్యి… ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశం గురించి పాయింట్ బై పాయింట్ వివరించారు. మొదట్లో గూగుల్ లోపల కొన్ని సందేహాలు ఉండేవి. “ఏపీలో ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్ సాధ్యమా?” అని. కానీ లోకేష్ ఆ అనుమానాలన్నీ తుడిచిపెట్టేశారు. ఒకసారి కాదు… రెండు సార్లు కాదు… నాలుగైదు రోజులు గూగుల్ కార్యాలయం చుట్టూ తిరిగి, వారి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చి, ఏపీలో సౌకర్యాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ అవైలబిలిటీ… అన్నీ చూపించి ఒప్పించారు.
ఇది ఒక సాధారణ మీటింగ్ కాదు - ఒక దృఢ సంకల్పం. తరువాత ప్రతి రోజూ గూగుల్ టీమ్‌తో టచ్‌లో ఉండి, ఫాలో అప్ చేశారు. విశాఖలో ఏర్పాట్లను పర్సనల్‌గా మానిటర్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సపోర్ట్‌తో మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ఫైనల్‌గా ఈ రోజు ఆ ప్రాజెక్ట్‌కు ముహూర్తం కుదిరింది. గూగుల్ డేటా సెంటర్ వస్తే… ఏపీలో ఐటీ రంగం కొత్త హైట్స్ చేరుతుంది. వేల సంఖ్యలో డైరెక్ట్ & ఇండైరెక్ట్ ఉద్యోగాలు, బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు, ప్రపంచ దృష్టి విశాఖపై పడనుంది. లోకేష్ ఈ ప్రాజెక్ట్ కోసం చూపిన పట్టుదలే ఈ విజయం వెనక ఉన్న అసలైన రహస్యం.