సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతుంది. నిజమా, అబద్ధమా అన్నదే చూడకుండా చాలా మంది వాటిని నమ్మేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, సెలబ్రిటీలు — ఈ మూడింటికీ సంబంధించి ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్‌లు, ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో మామూలుగా మారిపోయాయి. హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు — ఎవరు కూడా ఈ ఫేక్ వీడియోల బారినుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, అక్కడ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల హవా మరింత ఎక్కువైంది. రకరకాల పార్టీలు, అభ్యర్థులు, నేతల గురించి రోజుకో వీడియో బయటకు వస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పేయి పేరు ఒక ఇలాంటి ఫేక్ వీడియోతో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మనోజ్ బాజ్‌పేయి రాష్ట్రీయ జనతా దళ్  పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. “ఆర్జేడీని గెలిపించండి, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దు, ఈసారి మీ ఓటు తప్పకుండా ఆర్జేడీకే వేయండి” అంటూ ప్రచారం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో మొదట సోషల్ మీడియాలో షేర్ అయ్యి, క్షణాల్లోనే వైరల్ అయింది. మొదట ఎవరో సామాన్య వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేయడంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ వీడియోను బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ స్థాయి నాయకుడు ఒక వీడియోను షేర్ చేయడంతో అది ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.దీంతో ప్రజల్లో, మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది — “మనోజ్ బాజ్‌పేయి నిజంగానే ఆర్జేడీకి మద్దతు ఇస్తున్నారా?” అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో “తేజస్వీ యాదవ్ ఇంత పెద్ద వీడియో షేర్ చేసే ముందు కనీసం నిజమా కాదా అని చెక్ చేయలేదా?” అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదంపై చివరికి స్వయంగా మనోజ్ బాజ్‌పేయి స్పందించారు. ఆయన ఒక పోస్ట్ చేస్తూ స్పష్టంగా తెలిపారు —“ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి నేను కాదు. అది పూర్తిగా నకిలీ వీడియో. ఎవరో దురుద్దేశంతో, ప్రజలను మోసం చేసే ఉద్దేశ్యంతో సృష్టించారు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకండి."అంటూ  ఒక స్పష్టమైన పోస్ట్ చేశారు . ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో ఆగకుండా షేర్ అవుతూనే ఉంది. కొంతమంది తేజస్వీ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు — “ఇంత పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా షేర్ చేయడం ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ ఘటనతో మరోసారి ఫేక్ వీడియోల ప్రమాదం ఎంత పెద్దదో స్పష్టమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: