సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎప్పటినుండో వినిపిస్తుంది. ఎంతోమంది కామపిశాచాలు లాంటి ఇండస్ట్రీలో ఉండే వారికి అమాయకులు బలి అవుతూ ఉంటారు. సినిమాల్లోకి వచ్చి తెరపై తమని తాము చూసుకొని మురిసిపోవాలి అని ఎంతోమంది కలలుగని ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెడతారు. కానీ అలా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితం వెలుగులమయం అవుతుంది అనుకోవడం అబద్ధం.కొంతమంది జీవితం వెలుగులో నడిస్తే మరి కొంతమంది జీవితం చీకట్లో నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే సినిమాల్లో ఛాన్సులు రావాలంటే చాలామంది హీరోయిన్లు అక్కడక్కడ కొంతమంది దగ్గర తమను తాము అర్పించుకుంటూ ఉంటారు.కొంతమంది అలాంటి పని చేయడం ఇష్టం లేక ఇండస్ట్రీని వదిలేస్తారు.అయితే సినిమాల్లోకి వచ్చి కమిట్మెంట్లు ఇచ్చి రాణించిన వాళ్ళు ఉన్నారు. 

కమిట్మెంట్లు ఇవ్వకుండా రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తెలుగు హీరో ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి.కానీ ఆయన ఓ సినిమాలో చేసే సమయంలో హీరోయిన్ మీద మనసు పడ్డారు.ఆ హీరోయిన్ పక్కకి పిలిచి నువ్వు నాతో ఓ రాత్రంతా గడిపితే నీకు నా నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను అని నమ్మబలికారు. కానీ ఆ హీరోయిన్ అంత అమాయకురాలేం కాదు. నీ అవకాశం వద్దు నువ్వు వద్దు నువ్వు సినిమాలో పెట్టుకోకపోతే నాకు ఛాన్స్లే రావా..అయినా నేను నీలాంటి వాళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మను.

 నా టాలెంట్ ని నేను నమ్ముకుంటాను అని అందరి ముందు చెప్పుతో కొట్టి వెళ్లిపోయిందట. అయితే ఈ విషయంలో కొంతమంది ఆ హీరో తరఫున వాళ్లు హీరోయిన్ ని వేధించి టార్చర్ చేసి భయపెట్టినా కూడా హీరోయిన్ వెనక్కి తగ్గలేదట. అంతేకాదు మీరు ఇలాగే వేధిస్తే మీడియా ముందు ఫోటోలు,పేర్లతో సహా  మీ బండారం బయటపెడతాను అని వార్నింగ్ ఇచ్చిందట.అయితే అప్పటికి ఆ హీరోకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉండడంతో తన పేరు బయటపడితే పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఆ హీరోయిన్ ని వదిలేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: