
కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే వీటికి పరిష్కారం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా టిడిపి పార్టీ ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకుంటేనే సెట్ అవుతుందని తెలుపుతున్నారు.ఏదైనా నియోజవర్గంలో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే రిపోర్టు తెప్పించుకొని సస్పెండ్ చేస్తేనే మిగిలిన ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారని తెలుపుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెబుతున్నారు. అందులో ఒకరు చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఇన్చార్జి విషయంలో ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేన పార్టీ ఇన్చార్జి దగ్గర పిఏగా పనిచేస్తున్న కుర్రాడికి డబ్బులు ఇచ్చి మరి ప్రలోభాలకు గురిచేసి ఒక మహిళ నాయకత్వాన్ని తొక్కేశారు. అంతేకాకుండా ఆ కుర్రాడు మరణానికి కూడా కారణమయ్యారు ఆ ఎమ్మెల్యే. అయితే మరణానికి ముందు ఆ యువకుడు సెల్ఫీ వీడియో ఇటీవల కాలంలో మారింది. ఇంత జరిగినా కూడా పార్టీ పెద్దలు ఎమ్మెల్యే మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే మొదటినుంచి ఆరోపణలు,వివాదాలు వినిపిస్తున్నాయి. ఆమధ్య పోర్టు ఒకటి నిర్మాణంలో ఉంటే వారిని కూడా బెదిరించారని వార్తలు కూడా వినిపించాయి. ఒకవేళ ఆ ఎమ్మెల్యే కరెక్ట్ గా ఉండాలనుకున్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ మాత్రం ఆయనను ఉండనివ్వలేదట. ఈమధ్య కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చు రావడానికి ముఖ్య కారణం ఆ నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనని తెలియజేస్తున్నారు.
అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలలో ఒక రిజర్వుడ్ నియోజవర్గంలో మరొక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే మీద విపరీతమైన ఆరోపణలు కూడా ఉన్నాయట.ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరకలాగా వ్యవహరిస్తున్నారు. పేకాట, రేషన్ బియ్యం, ఇసుక, మద్యం అన్నిటిలో నుంచి కూడా వసూలు చేస్తున్నారట. అందుకే అక్కడ రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయింది అలా ఒక వర్గానికి మరొక వర్గానికి పడడం లేదు. ఎమ్మెల్యే కూడా తన పని తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటే మిగిలిన 40నుంచి 50 మంది ఎమ్మెల్యేలు సెట్ అయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. కానీ చర్యలు తీసుకోకపోవడంతో కూటమిలో నేతల ధీమా కూడా పెరిగిపోతోంది.ఇది పార్టీకి ,ప్రభుత్వానికి మైనస్ గా మారుతొందంటు తెలుపుతున్నారు.