
అలాగే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్గా మార్చాలని, షాజహానాబాద్ డెవలప్మెంట్ బోర్డుని కూడా ఇంద్రప్రస్థ డెవలప్మెంట్ బోర్డుగా మార్చాలి అంటూ VHP లేఖ ద్వారా తెలియజేశారు. అయితే ఈ పేర్ల మార్పు కేవలం మార్పులే కాకుండా ఇది ఒక దేశ చైతన్యానికి అద్దం లాంటిది అంటూ సురేంద్ర గుప్తా లేఖలో వెల్లడించారు. మనం ఢిల్లీ అని చెప్పినప్పుడు కేవలం 2000 సంవత్సరాల చరిత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ ఇంద్రప్రస్థ అని చెప్పినప్పుడు మన 5000సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర వినిపిస్తుందంటూ తెలియజేశారు.
చరిత్రకారులు, పండితులు, ప్రజాప్రతినిధులు ఇటీవల నిర్వహించిన ఇంద్రప్రస్థ పునర్జీవన సంకల్ప సభలో భాగంగా ఈ డిమాండ్లను తెలియజేసినట్లు గుప్తా తెలియజేశారు. ముఖ్యంగా ముస్లిం అక్రమదారుల స్మారక చిహ్నాలు ఉన్నచోట హిందువుల సంబంధించి వీరులు ,ఋషులు, పాండవుల కాలంనాటి స్థలాలను కూడా పరిచయం చేయాలంటూ వెల్లడించారు. అంతేకాకుండా వాటి వద్ద స్మారక చిహ్నాలను కూడా నిర్మించాలనే విధంగా డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పాఠశాలలో హేమచంద్ర విక్రమాదిత్య రాజు మరియు పాండవుల కాలం నాటి ఇంద్రప్రస్థ చరిత్రను కూడా తీసుకురావాలనే విధంగా డిమాండ్ చేసింది VHP. మరి ఢిల్లీ పేరు మారుతుందో లేదో చూడాలి.