తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఇప్పుడు ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ షో చాలా రసవత్తంగానే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్ వచ్చాక హౌస్ లో జరుగుతున్న పరిణామాలు బిగ్ బాస్ లవర్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఫీలవుతున్నారు. కంటెస్టెంట్స్ మధ్య మాటలు తూటాలల పేలుతున్నాయి. ఇలాంటి సందర్భంలోని బిగ్ బాస్ ఏడవ వారానికి సంబంధించి నామినేషన్ విషయంపై హోరాహోరీ గానే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.



హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రీతు చౌదరి వర్సెస్ ఆయేషా, రమ్యమోక్ష వర్సెస్ తనూజ గొడవలు హైలెట్ గా ఉన్నాయి. అయితే నామినేషన్ ముగిసేసరికి మొత్తం మీద 8 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ లో వైరల్ గా మారింది. ఇందులో రీతూ చౌదరి, కళ్యాణ్, దివ్య, రాము, సంజన, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి వీరు నామినేషన్లలో నిలిచారు. వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది తమ అభిమాన కంటెస్టెంట్లను కూడా కాపాడుకోవడానికి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓటింగ్ చేస్తున్నారు.


అయితే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఇప్పుడు ఓటింగ్లో టాప్ ప్లేస్ లో కళ్యాణ్  కొనసాగుతోంది. తనుజా రెండవ స్థానంలో  ఉండగా వీరిద్దరి మధ్య టాప్ ప్లేస్ కోసం హోరాహోరి పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మూడో స్థానంలో సంజన, నాలుగవ స్థానంలో రీతూ చౌదరి, ఐదవ స్థానంలో రమ్య మోక్ష, ఆరవ స్థానంలో దివ్య నిఖిత, ఏడు, ఎనిమిదవ ప్లేసులో అటు రాము రాథోడ్, శ్రీనివాస సాయి ఉన్నారు. డేంజర్ జోన్ లోని వీరిద్దరు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇంకా ఓటింగ్ కి రెండు మూడు రోజులు ఉంది కాబట్టి ఓటింగ్ లో ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: