ఏపీలో పెట్టుబడుల వాతావరణం మరింత బలోపేతం అవుతున్నది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పెట్టుబడుల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ ఒక విధంగా వ్యవసాయ రాష్ట్రం అయినా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి, పెట్టుబడుల కోసం అనుకూల వాతావరణాన్ని ఏర్పరచే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ పర్యటనలో ఉన్నారు. ఆయన అనేక ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలుసుకుని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. లోకేష్ ఇటీవల న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు వివరించారు, గడచిన పదహారు నెలలలో ఏపీలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా ప్రవేశించాయో.. ఆయన వివరించిన మూడు ముఖ్య కారణాలు ఏపీలో పెట్టుబడులు వచ్చేలా చేశాయని చెప్పారు. 


ఇందులో మొదటి కారణం, చంద్రబాబు నాయుడి విజనరీ లీడర్‌షిప్. వయసు ఏడున్నర పదులు అయినా, ఆయన యుక్తి, దక్షతతో, పట్టుదలతో ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని లోకేష్ తెలిపారు. రెండవది, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒప్పందం కుదిరిన వెంటనే ప్రాజెక్టులు తక్కువ సమయంలోనే గ్రౌండింగ్ అవుతాయని, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఇదే ఉదాహరణ అని చెప్పారు. విశాఖలో డేటా సెంటర్ 13 నెలల్లోనే రాబోతోందని, వేగవంతమైన నిర్ణయాలు కారణం అని లోకేష్ స్ప‌ష్టం చేశారు. ఇక మూడోది ప్రాజెక్టులపై నిరంతర సమీక్షా వ్యవస్థ. ప్రతి ప్రాజెక్ట్ కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తామని, సంబంధిత మంత్రులు, అధికారులు కూడా ఈ గ్రూప్‌లో ఉంటారని, ప్రతీ రోజు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తారని లోకేష్ తెలిపారు. ఇలా 25కు పైగా ప్రాజెక్టుల కోసం వర్కింగ్ గ్రూపులు కొనసాగుతున్నాయి.


ఇక ఏపీలో మరో బలం యూత్ కేబినెట్. మొత్తం 25 మంది మంత్రులలో 17 మంది యువ మంత్రులు ఉంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఏపీ ప్రస్తుతం పెట్టుబడుల కోసం ఆకలిగా ఉంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని లోకేష్ సిడ్నీ రోడ్ షోలో పారిశ్రామికవేత్తలకు వివరించారు. మొత్తం మీద, ఏపీకి పెట్టుబడులు, యువత సక్షమత, ప్రభుత్వ పద్ధతులు అన్నీ కలిసి రాష్ట్రాన్ని ఇజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ రాష్ట్రంగా మార్చి పెట్టుబడుల వరదకు కొత్త మార్గాలను తెరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: