తమిళనాడులో హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ సెప్టెంబర్ 27న ఒక బహిరంగ సభలో పాల్గొనగా అక్కడ భారీగా తొక్కిసులాట జరిగింది. దీంతో మొత్తం 41 మంది మరణించారు. మరి కొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పలు సంచలనంగా మారింది. ఈ విషయం పైన హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పైన చాలానే విమర్శలు చేశారు. అంతేకాకుండా విజయ్ ఆ బాధితులను కూడా పరామర్శించడానికి వెళ్లలేదనే విధంగా నెగటివ్ వార్తలు వినిపించాయి.


ఈ సంఘటన పైన విజయ్ సానుభూతిని తెలియజేస్తూ 41 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .20 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని నిర్ణయించారు. దీంతో నేరుగా ఆ బాధితుల కుటుంబాల ఖాతాకు ఆ డబ్బులను బదిలీ చేశారు. అనంతరం ఆ బాదిత కుటుంబాలను చెన్నైకి తీసుకువచ్చి నేరుగా మాట్లాడారు విజయ్. తాజాగా ఆ పరిహారాన్ని ఒక బాధితురాలు తిప్పి పంపిన వైనం సంచలనంగా మారింది. కరూర్ తొక్కిసిలాటలో మరణించిన వారిలో రమేష్ కూడా ఒకరు. ఆయన భార్య సంఘవికి విజయ్ రూ .20 లక్షల రూపాయలు పంపించిన వాటిని వెనక్కి తిరిగి పంపించింది.


బాధితురాలు సంఘవి మాట్లాడుతూ.. విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తామంటూ వీడియో కాల్ ద్వారా తెలిపారు. కానీ ముందుగా ఆర్థిక సహాయం తీసుకోవాలని చెప్పారు. విజయ్ పరామర్శ కోసం తాము కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న విజయ్ ఆహ్వానించిన ఆ సమావేశానికి వెళ్లలేదు ,కానీ తమ పేరు ఉపయోగించుకొని ముగ్గురు బంధువుల సైతం ఆ సమావేశానికి వెళ్లారు. అంతేకాకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా విజయ్ తన బ్యాంకులో రూ .20 లక్షల రూపాయలు వేశారని వాటిని తిరిగి ఇస్తున్నానంటూ తెలియజేసింది సంఘవి. మాకు డబ్బు ముఖ్యం కాదు గౌరవం ముఖ్యమని సంఘవి తెలియజేసింది. విజయ్ ఇచ్చిన డబ్బులను ఒక మహిళ తిరిగి పంపడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: