 
                                
                                
                                
                            
                        
                        “తుఫాన్ తీవ్రతను కొంతమేర నియంత్రించగలిగినా, పంటల నష్టం మాత్రం అంచనాలకు మించిన స్థాయిలో జరిగింది” అని ముఖ్యమంత్రి తెలిపారు. 87 వేల హెక్టార్ల పంట నష్టం: అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం, మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోని 304 మండలాలపై పడింది. మొత్తం 1,825 గ్రామాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 87 వేల హెక్టార్లలో పంటలు నాశనం కాగా, ఇందులో 59 వేల హెక్టార్ల వరి పంటే. అదనంగా ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు కూడా నీటమునిగాయి. ఈ విపత్తుతో సుమారు 78,796 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇవి ప్రాథమిక అంచనాలేనని, వాస్తవ నష్టం ఇంకా ఎక్కువగా ఉండవచ్చని బాబు అన్నారు. కేంద్ర సాయం పై ఆశలు: తుఫాన్ వెంటనే గడిచిన తర్వాతే బాబు చర్యలు ప్రారంభించారు. కేంద్రానికి నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఈసారి కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందనే ఆశతో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి తుఫాన్ తీవ్రత గురించి తెలుసుకోవడం, సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం కూడా ముఖ్యమైంది. “మొంథా” – హుదూద్, తిత్లీ తరువాతి సూపర్ సైక్లోన్: గతంలో హుదూద్, తిత్లీ తుఫాన్లు ఏపీని గట్టిగా దెబ్బతీశాయి. ఇప్పుడు మొంథా తుఫాన్ వాటి స్థాయిలోనే ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు. వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా. రాష్ట్రం పునరుద్ధరణకు భారీ ఆర్థిక సహాయం అవసరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి, మొంథా తుఫాన్ ఏపీని మరల పరీక్షలో పడేసింది. రైతు నుంచి ప్రభుత్వం వరకు అందరూ ఒకే ప్రశ్నతో ఉన్నారు - ఈసారి కేంద్రం నిజంగానే “ఉదారంగా” వ్యవహరిస్తుందా? లేక మళ్లీ ఫైళ్లలోనే సాయం ఇరుక్కుపోతుందా?
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి