తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా పరిపాలనపరంగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్ హోదా కల్పించబోతోంది. అజారుద్దీన్ తాజాగా రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు.కానీ ఏ శాఖకు ఆయన్ని మంత్రిగా కేటాయిస్తారు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కొంతమందేమో మైనార్టీ శాఖని అజారుద్దీన్ కి కట్టబెడతారని వార్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్లో హోదా కల్పించారు రేవంత్ రెడ్డి.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు అఫీషియల్ గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.. 

వాళ్ళు ఎవరంటే..మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.. వీరిద్దరికి కేబినెట్ హోదా కల్పించారు.సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను అప్పగించడంతోపాటు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయితే గత కొద్ది కాలంగా ఈ ఇద్దరు సీనియర్లు కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం వీరిని బుజ్జగించి కేబినెట్ హోదా పదవులు కేటాయించినట్టు తెలుస్తోంది.

 ఇక గతంలోనే సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు బాధ్యతను అప్పగించారు. అలాగే సుదర్శన్ రెడ్డికి మంత్రులకి ఉండే అన్ని సదుపాయాలు ఉంటాయని,అన్ని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలా సచివాలయంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి రేంజ్ లో వసతులు అందనున్నాయి. ఇక సుదర్శన్ రెడ్డి గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఓసీలను అంటే సుదర్శన్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రావు లకు కేబినెట్ హోదా కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: