- ( ఉత్త‌రాంధ్ర ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్ లో మరో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రైలింగ్ కూలిపోవడంతో పదిమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి అంతస్తులో ఉన్న ఆలయానికి మెట్ల ద్వారా వెళ్లిన భక్తులు, రైలింగ్ కూలిపోవడంతో పడిపోయినట్లు కాసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.


మరి కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కారణాలను వెలికి తీసేందుకు దర్యాప్తు మొదలుపెట్టినట్లు హోం మంత్రి అనిత ప్రకటించారు. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా మంత్రి అచ్చం నాయుడు, ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెన్షన్ల కార్యక్రమంలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని కాశిబుగ్గ చేరుకున్నారు.


అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణాన్ని ఒక సంచలనంగా చెప్పుకుంటూ ఉంటారు. నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ ధర్మకర్త హరి ముకుంద పాండా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళగా, ఆయనను అధికారులు అనుమతించలేదు. దీనితో 20 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణాన్ని 12 ఎకరాల తన సొంత పొలంలో చేపట్టారు. ఈ ఏడాది మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయం బాగా ప్రాచుర్యం పొందడంతో ప్రతి శనివారం భక్తులు భారీగా తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: