శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం లోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరి ముకుంద పాండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారని . . . శనివారం ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తాను ఊహించలేదని తెలిపారు. తాను భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను ఇలా జరుగుతుందని ఎంత మాత్రం ఊహించలేదు.. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని తెలిపారు. ఆలయంలోనే హరి ముఖుంద్ పాండా తో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ , ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ఆవరణలోనే హరి ముకుంద పాండా కూడా ఉన్నారు.
శనివారం ఉదయం కాశీబుగ్గ లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస లాట జరిగి మొత్తం 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాస ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. వాస్తవానికి ఆలయానికి మూడు వేల వరకు భక్తులు వస్తారని అనుకున్న ఆ సంఖ్య 20వేల వరకు ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి తోడు ఆలయం లో పై అంతస్తులో ఉన్న ఆలయానికి భక్తులు వెళుతున్న క్రమంలో రైలింగ్ ఊడి కింద పడిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి పది మంది వరకు మృతి చెందినట్లు చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి