జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తుంది.. రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ డైరెక్షన్ లో నేతలంతా ప్రచారంలో మునిగి పోతున్నారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర నేతలకు ముఖ్యమంత్రి నివాసంలోనే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు అనేది తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటీ వరకు పార్టీ ప్రచారం ఎలా సాగింది. ముందు ముందు ఎలా సాగబోతోంది. ఎంతమందిని కలుస్తున్నారు అనేదానిపై ఆరా తీసారట.  

రానున్న వారం రోజుల్లో ఎలా ప్రచారం చేయాలనే దానిపై కూడా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఒక్కొక్క నాయకుడికి వంద మందిని అప్పగించాలని, ఏడు నుంచి 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడిని పర్యవేక్షకుడిగా నియమించాలని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలుస్తోంది. ఎక్కడా కూడా ఏమరపాటు వద్దని,ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉండాలని హితవు పలికినట్లు సమాచారం.  అంతేకాదు కాంగ్రెస్ తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలు ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 150 కోట్లకు పైగా ఖర్చుపెట్టిన విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారట.

 అయితే ఈ నెల 9న ప్రచార గడువు ముగిసేసరికి జూబ్లీహిల్స్ లో ప్రతి ఒక్క ఓటర్ ను కాంగ్రెస్ నాయకులు కలవాలని, గడువు ముగిసే వరకు రాష్ట్ర నాయకులు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం . ఇప్పటికే ఒక మారు ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి ప్రచారానికి రానున్నారని తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ గెలిస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఓడింది అంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎన్నికను జీవన్మరణ పోరాటంలా భావిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: