జూబ్లీహిల్స్ దీని పేరు వినగానే సంపన్నులు ఉండే నియోజకవర్గం అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ 70% బీద,మధ్యతరగతి ప్రజలే నివసిస్తారు.. మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా 50% కంటే ఎక్కువ ఎన్నిక సాగదు. కానీ ఈసారి ఎన్నికల ఓటింగ్ శాతం అనేది పెంచాలని ప్రతి పార్టీ చూస్తోంది. ఇదే తరుణంలో ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రచారం చేస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు.. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తోంది.. అనే వివరాలు చూద్దాం.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా ముగ్గురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువగా మైనారిటీ ఓట్లు పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ ఓట్లు ఎక్కువ ఎవరికి పడితే వారి విజయం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎర్రగడ్డ, షేక్ పేట,రహమత్ నగర్ డివిజన్ల లోని ఓటర్లే ప్రధానం. 

ఇక వీళ్లే కాకుండా బోరబండకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. రహమత్ నగర్ లో 70 వేల ఓట్లు ఉన్నాయి. గతంలో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. కానీ లోక్ సభకు వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది.. అలాగే ఎర్రగడ్డ, షేక్ పేట,బోరబండల్లో మైనారిటీలే కీలకం. ఇక్కడ మొత్తం 1.10 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పార్టీ ఈ ఓటర్లనే ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక వీళ్లే కాకుండా బీసీ ఓట్లు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా యూసుఫ్ గూడా, సోమాజిగూడ, వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా బీసీ ఓటర్లు ఉంటారు. ఇక్కడ మున్నూరు కాపులు,యాదవులు, గౌడలు,చేతి వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో బీసీ నినాదం రాష్ట్రంలో ఎక్కువగా వినబడుతుంది కాబట్టి బీసీ ఓట్లు బీసీ నాయకుడికి కలిసివచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో పెద్దపెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఓటర్లంతా ఒకే దగ్గర ఉంటారు.

దీంతో అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం ఆయా అపార్ట్మెంట్ల నాయకులతో మాట్లాడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అంతేకాకుండా ముస్లిం మత పెద్దలతో మాట్లాడుతూ వారిని కన్విన్స్ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. మొత్తం ఇక్కడ 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా  ఒక్కో పోలింగ్ కేంద్రానికి 100 మందికి ఒక నాయకుడిని పార్టీ నియమిస్తుందని తెలుస్తోంది. ఈ విధంగా ప్రతి ఓటు కీలకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక మరికొన్ని పార్టీలు డిజిటల్ తెరల ద్వారా ప్రచారం చేస్తున్నాయి. రోడ్ షోలు, లేజర్ బీమ్స్ తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వారి పార్టీ గుర్తులను ప్రదర్శిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ  నేతలు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు.. ఇంత చేస్తున్న ప్రజల మనసులో ఏ నాయకుడు ఉన్నాదనేది రిజల్ట్ వచ్చే వరకు చెప్పడం కష్టం. మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి రాష్ట్ర పార్టీల భవిష్యత్తును మలుపు తిప్పుతారనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: