తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు వీరి పాలన కొనసాగ బట్టి దాదాపు రెండు సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. ఇదే తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. కానీ మంత్రివర్గంలోని కొంతమంది మాత్రం దూకుడుగా ప్రదర్శిస్తూ పలు వేదికల మీద రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసే మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు. అలాంటి ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం వీరిపై వేటువేయాలని ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బీసీ మంత్రులను పక్కనపెట్టి వారి స్థానంలో వేరే బీసీ వ్యక్తులను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరి ఏ మంత్రులను వారు పక్కన పెట్టబోతున్నారు అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

తెలంగాణ మంత్రి వర్గంపై ఒక ప్రముఖ ఎడిటర్ రాసిన కథనం ప్రకారం.. ఇద్దరు బీసీ మంత్రులు ఒక రెడ్డి మంత్రిపై వేటు పడనుందని తెలుస్తోంది.. ఇందులో ముఖ్యంగా కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవులు కోల్పోతారని ఆ కథనంలో రాసుకొచ్చారు..వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.. ముఖ్యంగా బీసీ మంత్రుల్లో కొండా సురేఖను ముందుగా తీసివేసి ఆ స్థానంలో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సినీనటి విజయశాంతిని తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఇక పొన్నం ప్రభాకర్ స్థానంలో ప్రముఖ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తీసుకువచ్చి పదవి అందిస్తారట. ఇక కోమటిరెడ్డిని తీసివేసి నల్గొండ నుంచి గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్ కి అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. అయితే వీరిని పక్కన పెట్టడానికి కారణాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కొండా సురేఖ అప్పట్లో నాగార్జున ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని, పొంగులేటి కుటుంబాన్ని విమర్శిస్తూ వచ్చింది. ఈ విధంగా నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల చాలా వివాదాలయ్యాయి. దీంతో అధిష్టానం వారిని పక్కన పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, రేవంత్ రెడ్డికి సరైన కమ్యూనికేషన్ ఉండడం లేదట. దీంతో ఆ స్థానంలో ఆయనను తీసేసి పిసిసి బాధ్యతలు పొన్నం ప్రభాకర్ కు అప్పజెప్పి, ఆయన మంత్రి పదవిని మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వబోతున్నట్లు సమాచారం.. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.m

మరింత సమాచారం తెలుసుకోండి: