ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా లబ్ధి పొందే విధంగా చూస్తోంది. ఇందులో భాగంగా అటు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా రెట్రోపిట్టేడ్ త్రీ వీలర్స్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇది అందరికీ కాదు కేవలం దివ్యాంగులకు మాత్రమే వారి యొక్క సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అర్హతలను పూర్తి వివరాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉందట.


ఈ పథకం కింద దివ్యాంగులకు ఉచితంగానే త్రి వీలర్స్ అందుకోవచ్చు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అర్హత లేదా ఆ పైన ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు వీరికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే  పదవ తరగతి పాస్ అయ్యి స్వయం ఉపాధితో జీవించేవారు కూడా ఈ పథకానికి అర్హులే అంటూ తెలుపుతున్నారు. 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి అలాగే 70 శాతం వరకు అంగవైకల్యం కూడా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులంటూ అధికారులు తెలియజేస్తున్నారు. ఇందుకోసం పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ www. apdascac.ap. gov. In వెబ్ సైట్ ని సంప్రదించాల్సి ఉంటుంది.


అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ నెల 25వ తేదీ లోపు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలుపుతున్నారు. చాలామంది దివ్యాంగులలో కూడా నిరుపేదలు ఉన్నారు వారిని గుర్తించి కూటమి ప్రభుత్వ ఇలా ఉచితంగా త్రీ వీలర్ మోటార్స్ ని అందించే విధంగా ప్లాన్ చేస్తోంది .దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవడానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగులు సైతం ఏదైనా ఉద్యోగం లేదా బిజినెస్ వంటివి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: