బీహార్లో ఇటీవలే మొదటి దశ పోలింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశలో భాగంగా 121 స్థానాలకు నవంబర్ 6వ తేదీన పోలింగ్ జరగగా ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఓటింగ్ శాతం 64.66 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇది సంచలనంగా మారినప్పటికీ ఇప్పుడు తాజాగా సమస్తీపూర్ జిల్లాలో రోడ్లపైన VVPAT స్లిప్పులు పెద్ద సంఖ్యలో కనిపించడంతో ఒక్కసారిగా బీహార్ ఎన్నికలలో కలకలాన్ని సృష్టిస్తోంది.


ఈ విషయం వైరల్ గా మారడంతో స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ ను కూడా సస్పెండ్ చేసి అతని పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది అధికారులు. సమస్తీపూర్ జిల్లా సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  ఉండేటువంటి ఒక కాలేజీ వద్ద రోడ్డుపైన ఇలాంటి స్లిప్పులు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్నికల సంఘం ఏకంగా రంగంలోకి దిగి, ఆ జిల్లాకు సంబంధించిన అధికారులను అరెస్టు చేసి వెంటనే ఈ VVPAT స్లిప్పుల పైన విచారణ జరిపించాలని తెలియజేశారు. అయితే ఈ స్లిప్ అన్ని కూడా మాక్ పోలింగ్లో భాగమైనట్టుగా వినిపిస్తున్నాయి.


ఇలాంటివి జరగడం వల్ల ఎన్నికల విధానానికి విఘాతం కలిగిస్తుందని, ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఏఆర్ఓను సస్పెండ్ చేశారు. ఈ ఘటన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం పైన అక్కడి నేతలు కూడా ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు ఈసీ అధికారులను. ఇందుకు సమాధానాన్ని చెప్పాలి అంటు ఆర్జెడి నేతలు, రాష్ట్రీయ జనతా నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నామంటూ ఈసీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇక రెండవ దశ 122 నియోజకవర్గాలలో ఓటింగ్ నవంబర్ 14న జరగబోతోంది. అదే రోజున ఫలితాలు వెలుబడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: