( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. ఇప్పటికే 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయి పదో రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. నవీన్ యాదవ్ కు 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి భారతీయ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసిన మాగంటి సునీత గోపీనాథ్ పై నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు. ఇక బిజెపి నుంచి పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి పదివేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో గాంధీభవన్లోనూ .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి.


అటు యూసఫ్ గూడ లోని నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర కూడా సంబరాలు మామూలుగా లేవు. ఒక్క తొలి రౌండ్ లో మిన‌హా బీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ఎక్క‌డా గ‌ట్టి పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. తొలి రౌండ్ లో మాత్ర‌మే అది కూడా షేక్‌పేట డివిజ‌న్ల లోని ఓట్ల లెక్కింపు జ‌రిగిన‌ప్పుడే బీఆర్ ఎస్ పై కాంగ్రెస్ కు కేవ‌లం 62 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప్ర‌తి రౌండ్‌లోనూ కాంగ్రెస్ దూసుకు పోయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: