తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది.. ఇప్పటికే తెలంగాణలో వీరు పాలన చేయబట్టి రెండు సంవత్సరాలు దాటింది. 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఉచిత బస్సు, కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఇలా ప్రజలలో మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్, ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ముఖ్యంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఎదురులేదనిపించుకుంది. అంతేకాకుండా  తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ ని గెలిపించుకుని సత్తా చాటింది. ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టు ఉంది.

బీఆర్ఎస్ ఇతర పార్టీలకు బలం లేదని ప్రజలకు చాటి చెప్పింది. అలాంటి ఈ సమయంలో  తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని, కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారెవరు కారణమేంటో చూద్దాం.. బీఆర్ఎస్ పార్టీలో  గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ చేస్తున్నటువంటి కోర్టు ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలకు సమానులు జారీ చేసింది. ఇదే తరుణంలో వీరిపై అనర్హత వేటు వేస్తే వీరి ఎన్నిక చెల్లకుండా పోతుంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం అది జరగక ముందే వీరిద్దరితో రాజీనామా చేయించి మళ్ళి ఉప ఎన్నికపెట్టాలని చూస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. రాజీనామా చేయించిన తర్వాత ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి. ఒకవేళ ఇవన్నీ సాఫీగా ముందుకు వెళ్తే మాత్రం అస్సాం, తమిళనాడు,మేఘాలయ ఎన్నికలతో పాటు ఈ రెండు ఉప ఎన్నికలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: