ప్రాజెక్టులపై  రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల ఇష్యుపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ఘాటు లేఖ రాశారు జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో సర్కారు అనుసరిస్తున్నటువంటి వ్యవహారం పై వైఎస్ జగన్ లేఖ లో ప్రస్తావించారు. 9 పేజీలతో కూడినటువంటి ఈ లేఖ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైబ్యునల్ లో రాష్ట్ర సర్కార్ వారి వాదనలను గట్టిగా వినిపించాలని లేఖలో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిరక్షించే విధంగా ట్రైబ్యునల్ లో గట్టిగా వాదనను వినిపించాలని కోరారు. 

ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం వహించినా కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ రైతులకు హక్కులను కోల్పోయే అవకాశం ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా నది జలాలలో 763 టీఎంసీలు ఇచ్చేందుకు ట్రైబ్యునల్ అంగీకరిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్రంగా నష్టం కలిగే అవకాశం ఉందని సూచించారు. ఈ విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి శ్రేయస్సు కలిగేలా సర్కారు వారి యొక్క వాదనలను గట్టిగా వినిపించాలని తెలియజేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు.

 1996 సమయంలోనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు  ఆల్మట్టి డ్యాం ఎత్తు  519.6 మీటర్ల నుంచి మొదలు 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క హక్కులకు ముప్పు ఏర్పడకుండా తగిన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి ఆయన లేఖకు చంద్రబాబు స్పందించి కృష్ణా జలాలపై ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారా..లేదంటే ఆయన లేఖను పట్టించుకోకుండా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: