తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఎంతోమంది పారిశ్రామికవేత్తలను,సినిమా వాళ్ళను ఇలా ఫ్యూచర్ సిటీ కోసం ఎన్నెన్నో చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్ని చేసిన రేవంత్ ఆ ఒక్క లాజిక్ మాత్రం ఎలా మిస్ అయ్యారు అనే వాదన సోషల్ మీడియా మెయిన్ మీడియాలో వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ కి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను పిలిచారు.ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చారు.అలాగే మిగతా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ వచ్చిన అసలు డౌట్ ఏంటంటే.. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,మల్లికార్జున ఖర్లే లను కూడా ఆహ్వానించారు. 

కానీ వీళ్ళు ఎవరు ఎందుకు ఈ సమావేశానికి హాజరు కాలేదు అనేదే అందరిలో వినిపిస్తున్న చర్చ. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి పెట్టుబడులను కూడా ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు ఐదు లక్షల కోట్లు ప్రకటించారు.ఓవరాల్ గా చూసుకుంటే గతంలో రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి తీసుకువచ్చిన ఒప్పందాలతో కలిపితే ఏడు లక్షల కోట్లు.. ఇక ఇందులో ఎంత ఎగ్జిట్ అవుతుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది. పెట్టుబడులు పొందడం సంతోషమే కనీసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ కి కనీసం రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున ఖర్గేలు ఎవరూ రాలేదు. పార్లమెంటు శాసనసభ మీటింగ్లు ఉంటాయి అనుకుంటే మరి కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రులకు కూడా ఆ మీటింగ్లు ఉంటాయి కదా..

వాళ్ళు వచ్చారు వీళ్ళు మాత్రం ఎందుకు రాలేదనే డౌట్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అంతేకాదు కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా ఈ కార్యక్రమంలో మాట్లాడలేదు అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంత మంది మాట్లాడారు. ఇలాగే రాహుల్ గాంధీ,సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,ఖర్గేలు మాట్లాడవచ్చు కదా. ఇందులో లోపం ఎక్కడుంది రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ మారిపోతారనే ప్రచారం లేదు కానీ ఆయన విషయంలో పార్టీ ఎంత సీరియస్ గా ఉంది అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: