ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 2024 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం, రాజధాని అమరావతి విషయంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఐటీ కంపెనీలను తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నని ఐటీ హబ్ గా మార్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిసెంబర్ 12న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించబోతున్నారు.

మధురవాడ, ఋషికొండ, ఐటీ జోన్ వంటి ప్రాంతాలలో ఏకంగా 9 కంపెనీలకు వాటికి సంబంధిత యూనిట్లకు సైతం శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీఐఐసీ ద్వారా కేటాయి 70 ఎకరాల భూములలో ఈ ఐటీ కంపెనీలు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ భూమి ధర కనిష్టంగా నాలుగు కోట్ల రూపాయల వరకు పలకనుంది. ఈ ఐటీ కంపెనీల వల్ల యువతకు సుమారుగా 41,967 వేల ఉద్యోగ అవకాశాలు వెలుబడనున్నాయి. చంద్రబాబు ప్రారంభించి ఈ ఐటీ కంపెనీలలో కాగ్నిజెంట్ టెక్నాలజీ, సత్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సామ్వర్థ్యన  ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లూయెంట్  గ్రిడ్ లిమిటెడ్, ఇమాజినోవేట్ టెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, క్వార్క్స్  టెక్నో స్టాప్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ టెక్ తమ్మినా, ACN హెల్త్ కేర్ ఆర్సిఎం సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు విశాఖపట్నంలోకి రాబోతున్నాయి.


గ్లోబుల్ టెక్నాలజీ వల్ల విశాఖపట్నం  త్వరలోనే ఇన్నోవేషన్ హబ్ గా మారెందుకు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూటమి పార్టీ వైరల్ గా చేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల ముందు చెప్పిన హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటీవల చంద్రబాబు పనితీరును కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నట్లు వినిపిస్తున్నాయి. కూటమిలో కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గ్రామస్థాయి లెవెల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: