ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా నాశనమవుతుందని భావించిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే టీపీసీసీగా బాధ్యతలు చేపట్టారో అప్పటినుంచి పార్టీ మళ్లీ పుంజుకుంది.. ఇదే సమయంలో తెలంగాణను రెండు దఫాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది.. ఈ స్థానాన్ని బీజేపీ అధిరోహిస్తుందని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా కొంతమంది లీడర్ల వల్ల బిజెపి పార్టీ తెలంగాణలో రోజురోజుకి వెనక పడిపోతుందని చెప్పవచ్చు.. మరి ఆ నాయకులు ఎవరూ ఆ వివరాలు చూద్దాం.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన చూశారు. రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు.. ఇక మిగిలింది బీజేపీ పార్టీనే.. రాబోవు రోజుల్లో బీజేపీ బలపడుతుందని అంతా భావిస్తూ ఉంటే ఆ పార్టీలో ఉండే నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. 

దీంతో బీజేపీ పార్టీ రోజురోజుకి కాస్త వెనక్కి వెళ్ళిపోతోంది.. దీనికి కారణం ఈటెల రాజేందర్,బండి సంజయ్ మధ్య ఉన్న గొడవలే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు.. బండి సంజయ్ ఎప్పుడైతే బిజెపి పార్టీకి అధ్యక్షుడు అయ్యాడో అప్పటినుంచి తెలంగాణలో బిజెపి కాస్త బలపడింది. ఏకంగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లను కూడా గెలుచుకుంటూ వచ్చింది.. కానీ ఈటల రాజేందర్ బిజెపిలోకి చేరిన తర్వాత  బండి, ఈటల మధ్య అస్సలు  సెట్ అవ్వడం లేదు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని పాడు చేస్తున్నారని తెలుస్తోంది.. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో ఈటెల రాజేందర్ పార్టీలో చేరారు. ఆ సమయంలో బండిని అధ్యక్షుడి పదవి నుండి తొలగించారు.  

బండి సంజయ్ నేతలందరినీ కలుపుకొని వెళ్లడం లేదంటూ అధిష్టానానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు... దీంతో ఆలోచన చేసిన అధిష్టానం ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి బండి సంజయ్ ఈటెలపై పగ పెంచుకున్నారు. అలా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అధినాయకత్వానికి వారి విషయాలను చెబుతూ వస్తున్నారు.. దీనివల్ల కింది స్థాయిలో పార్టీ క్యాడర్ అంతా పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఇదిలా ఉంటే రాబోవు రోజుల్లో కూడా రాష్ట్రంలో బిజెపి బలపడడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మరి చూడాలి అధిష్టానం ఏమైనా సెట్ చేసి వీరి మధ్య విభేదాలు లేకుండా చేస్తుందా..  లేదంటే మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: