ఏపీ రాజకీయలలో వైఎస్ కుటుంబానికి ఎంత అభిమానం ఉందో చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసిపి పార్టీలో షర్మిల కీలకంగా వ్యవహరించింది. తన అన్న గెలుపే లక్ష్యంగా పనిచేసిన షర్మిల 2019లో జగన్ సీఎం అయిన తర్వాత కొన్నేళ్ళకి జగన్, షర్మిల మధ్య విభేదాలు వచ్చాయని వినిపించాయి. దీంతో షర్మిల రాజకీయ పందాలు మార్చుకుంది. గత రెండు మూడేళ్లుగా వైఎస్సార్ బిడ్డలు ఇద్దరు (షర్మిల, జగన్) రాజకీయంగా విమర్శించుకుంటున్నారు. ఈ విషయం అటు వైయస్సార్ అభిమానులకు నచ్చడం లేదు.



దీంతో వైయస్సార్ అభిమానులు అందరూ కూడా ఈ అన్నా చెల్లెలు మళ్లీ కలిసి కనిపించాలని కోరుకుంటున్నారు. గతంలో కూడా చాలా కుటుంబాలలో రాజకీయంగా విభేదించుకున్న ఆ తర్వాత మళ్లీ కలిసిపోయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. అలా ఆలోచిస్తే జగన్ ,షర్మిల కూడా ఎప్పుడో ఒకసారి కలిసే వీలుందని భావించవచ్చు. అటు జగన్, షర్మిల ఇద్దరూ కూడా పట్టుదల కలిగిన వారే కావడంతో వీరు ఎప్పుడు కలుస్తారనేది మాత్రం చెప్పడం కష్టమే. అయితే ఇటువంటి తరుణంలోనే వైసీపీలో కీలక నేతగా మాజీ ఎమ్మెల్సీ అయిన సతీష్ కుమార్ రెడ్డి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ,షర్మిల కలిసిపోయేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఈ విషయం వైరల్ గా మారింది.


జగన్ కి చెల్లెలు అంటే చాలా అభిమానం అలాగే కుటుంబం గురించి కూడా చాలా గొప్పగానే చెబుతూ ఉంటారు. జగన్ ను తాము దగ్గర నుంచి చూసాము ఆయన ఎప్పుడూ కూడా తప్పులు చేయరని ఆయన ఎవరికైనా మేలు చేసే మనిషిగానే ఉన్నారని తాను దగ్గర నుంచి చూసిన అనుభవంతోనే ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. ఇక షర్మిల ఏపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తోంది షర్మిల. కానీ ఎక్కడ కూడా వైసిపి గురించి ఎటువంటి కామెంట్స్ అయితే ఈమధ్య చేయడం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ నేతగా ఆమె చేయవలసిన పని కూడా అదే కానీ, గత వైసిపి హయాంలో కూటమి ప్రభుత్వం కంటే షర్మిలనే ఎక్కువగా విమర్శించారు. ఇప్పుడు షర్మిల వైఖరిలో మార్పు రావడం అన్నది చర్చనీయాంశంగా మారింది అంటూ సతీష్ రెడ్డి తెలిపారు. దీంతో వారిద్దరు కలిసి పోవచ్చని కూడా తెలుపుతున్నారు ఈ నేత.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP