ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ఒకేసారి సీఎం అయ్యారు.. కానీ ఆయన ఆలోచన విధానంతో అక్కడి పరిస్థితులన్నీ మార్చేశారు.. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇలాంటి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ఓ వైపు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ఏకమై గత ఎన్నికల్లో ఓడించారు.  వాళ్లంతా కలవకపోతే అక్కడ జగన్ దే గెలుపు ఉండేది. కానీ  గుంపుగా వచ్చి జగన్ ను ఓడించారు. అంతే కాదు రాష్ట్రంలో ఆయన చేసింది ఏమీ లేదంటూ ప్రజలకు తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే దీనిపై స్పందించినటువంటి జగన్ మోహన్ రెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సజీవ సాక్షాన్ని బయటపెట్టారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది.. 

మేం వచ్చిన తర్వాతే పరిస్థితులు చక్కబడుతున్నాయంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు తెగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి ఆధారాలు చూపించారు. జనసేన,తెలుగుదేశం పార్టీలు ఎన్నికలకు ముందు పనిగట్టుకొని విష ప్రచారం చేసాయి. వైయస్సార్పీ హయాంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతిందని, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ హయాంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదని, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని చెప్పుకొస్తున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.ప్రస్తుతం రాష్ట్రం వెనుక్కు వెళ్లి పోతుందని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటలకు కౌంటర్ ఇచ్చారు.

 ఒకవేళ నా హయాంలో ఇలా జరిగి ఉంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉండేది కాదు కదా అంటూ చెప్పుకోచ్చారు. తయారీ రంగాభివృద్ధిలో దక్షిణ భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కు తీసుకొచ్చాను. దేశవ్యాప్తంగా నెంబర్ 5 లో నిలబెట్టాను. పరిశ్రమ రంగాభివృద్ధిలో  ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 లో ఉంది, దేశవ్యాప్తంగా నెంబర్ 8 లో ఉంది. దీన్నిబట్టి అసలు 2019 నుంచి 2024 మధ్య  ఏపీ అభివృద్ధి దెబ్బ తిన్నదా లేదంటే ఎప్పుడు చూడని పురోగతిని చూసామా ప్రజలే ఆలోచించుకోవాలి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్ చేశారు. ఈ ట్వీట్ వైసీపీ సృష్టించింది అయితే కాదు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి దగ్గర నుంచి వచ్చినటువంటి డాటా ఆధారంగానే ఈ ట్వీట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: