మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తామని మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీలతో ఆటోలను కూడా అందిస్తామని, (2 లక్షల రూపాయలు పడే ఆటో రూ.80 వేలకే) గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4500 రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని,కానీ ఇప్పుడు వేటకు వెళితే మత్స్యకారులకు రూ.20వేల రూపాయల వరకు అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ సౌకర్యం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు మంత్రి. మత్స్యకారులకు సంబంధించిన అన్ని రాయితీలను ప్రధానమంత్రి మత్స్య సంపాదన యోజన పథకం కింద ( తెప్పలు, ఇంజన్, పడవలు, వలలు) అందించేలా చేస్తామని తెలిపారు. అర్హులైన వారు ప్రతి ఒక్కరు కూడా తమ పేర్లను గ్రామ వార్డు సచివాలయాలలో అప్లై చేసుకోవాలని తెలియజేశారు.
మత్స్యకారుల ఓబీసీ వర్గాలకు 40% రాయితీ లభిస్తుందని అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి 60 శాతం వరకు రాయితీ ప్రభుత్వం అందిస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి మత్స్యకారులు అన్ని సబ్సిడీ పరికరాలు పొందాలి అంటే సొంత బోటుతో పాటుగా అందుకు సంబంధించిన లైసెన్సులు కూడా కచ్చితంగా ఉండాలని తెలిపారు. సబ్సిడీ ద్వారా పొందిన మిగిలిన డబ్బులను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి