మన భారతదేశం ఎంత విశాలమైనదో మన అందరికి తెలిసిందే. భారత దేశంలో ఎన్నో కోట్ల మంది నివసిస్తున్నారు. ఇక భారత దేశ రాజధాని ఢిల్లీ అనే విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే అనేక మంది భారతదేశానికి రెండు రాజధానులు ఉండాలి అనే వాదనను గత కొంత కాలంగా వినిపిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొంత మంది తెలుగు వాళ్ళు భారతదేశానికి రెండవ రాజధాని కచ్చితంగా ఉండాలి. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా కొనసాగుతుంది.

భారతదేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు మరియు దక్షిణాది రాష్ట్రాలకు అత్యంత దూరంగా ఉంటుంది. ఇక ఢిల్లీ లో కలుషితం భారీ గా పెరిగిపోయింది. అలాగే ఢిల్లీ లో ఎవరైనా ఉగ్రవాదులు చేయాలి అనుకుంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కాలుష్యం అనేది ఎక్కువగా లేదు. ఎవరైనా ఉగ్ర దాదులు చేయాలి అనుకున్న కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రయత్నాలు చేయడం అత్యంత కష్టం అని దాదాపు అలా చేయడం అసాధ్యం అనే వాదనను కూడా కొంత మంది వినిపిస్తున్నారు. అలాగే దక్షానది ప్రాంతంలో రెండవ రాజధాని ని నిర్మించినట్లయితే దక్షిణాది ప్రజలకు భారత రాజధాని అనేది ప్రయాణానికి ఎంతో అనుకూలంగా కూడా ఉంటుంది అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.

మరి చాలా మంది దక్షిణాది మేధావులు, అలాగే అనేక మంది సాధారణ ప్రజలు కూడా దక్షిణాది రాష్ట్రాలలో ఒక రాజధాని ని నిర్మిస్తే బాగుంటుంది అని దాని ద్వారా దక్షిణాది ప్రజలకు రాజధాని అత్యంత దగ్గరగా ఉంటుంది. అలాగే ఉగ్ర దాడులను నివారించడానికి ఉపయోగపడుతుంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో కాలుష్యం కూడా ఎక్కువగా లేనందువలన రెండవ రాజధాని ని దక్షిణాది రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తే రెండవ రాజధాని కూడా అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: