గోదావరి పడవ ప్రమాదం నేపథ్యంలో భారత నేవీ సిబ్బంది సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది. ఇదిలా ఉండగా  ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు.


కానీ ఆ బోటును వెలికి తీయడం తమ వల్ల కాదని భారత నేవీ వర్గాలంటున్నాయి. గోదావరిలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమకు 150 అడుగుల లోతు వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉందని ఆ వర్గాలు తేల్చిచెప్పినట్టు సమాచారం. అన్ని కోణాల్లోనూ పరిశీలించాక ఆ విధానాన్ని ఇక్కడ అనుసరించడం అసాధ్యమని తేల్చారు. చివరికి ఇలాంటి ఆపరేషన్లలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన నేవీ అధికారి దశరథ్ సైతం ఇది అసాధ్యం అంటూ తేల్చేయడంతో ఇక ఆ బోటు పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 



బోటు మునిగి పోయి ఉంటుందనుకున్న ఏరియాలో మార్కింగ్ చేశారు. అయితే గోదావరి సుడులు తిరుగుతోంది. 100 కి.మీ దూరంలో యానం వరకు మృతదేహాలు కొట్టుకుపోయాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొన్నేళ్ల కిందట బలిమెల రిజర్వాయరులో భద్రతా బలగాలతో కూడిన బోటు మునిగింది. అప్పట్లో దాన్ని వెలికితీసేందుకు అనుసరించిన పద్ధతిని ఇక్కడ అమలు చేయొచ్చని ఆరా తీసి బలిమెల సహాయక చర్యల్లో పాలుపంచుకున్న సంస్థ ప్రతినిధిని ఘటనా స్థలానికి రప్పించారు. అది రిజర్వాయర్‌ కావటంతో ప్రవాహం నిశ్చలంగా ఉండేది. నీరు బురదగా కాకుండా తేటగా ఉండేది.  


మరింత సమాచారం తెలుసుకోండి: