ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి అడుగు పెట్టిన సమయం నుంచి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ప్రజలకు కష్టాలు లేకుండా చేసేందుకు ప్రతిక్షణం ప్రజల కోసం ఉపయోగిస్తున్నారు వైఎస్ జగన్. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు వైఎస్ జగన్ తీసుకుంటున్నాడు. 


రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. పుట్టిన పాప నుండి వయో వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరి ఉపయోగ పడే విధంగా అయన సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అదే తరహాలోనే ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు వైఎస్ జగన్. వివరాల్లోకి వెళ్తే .. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై నిషేధం విధించింది. 


ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ సలహా మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సుజాతరావు కమిటీ వందకుపైగా సలహాలు ఇచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకూ ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్య చికిత్సల జాబితాలో మరిన్ని వ్యాధులను కలపాలని సుజాతరావు కమిటీ ప్రతిపాదించింది. 


కాగా ప్రభుత్వ వైద్యుల వేతనాలు పెంచాలని కమిటీ సూచించింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకం అమలుకానుంది. కాగా ఆరోగ్యశ్రీలోకి దాదాపు 2 వేల వ్యాధులను కలిపారు వైఎస్ జగన్. దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను కొత్తగా చేర్చింది ప్రభుత్వం. 


ఆపరేషన్లు చేయించుకునే వాళ్లు కోలుకునే వరకూ ప్రతిఒక్కరికి నెలకు రూ.5 వేల సాయం అందించనుంది వైసీపీ ప్రభుత్వం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 5 వేల రూపాయిలు సాయానికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కాగా వెయ్యి రూపాయిలు దాటే ప్రతి వ్యాధికి 'ఆరోగ్య శ్రీ'లో చికిత్స అందిస్తారు. కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ డిసెంబర్ 21 నుంచి జరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటు సంచలనల సీఎం గా పేరు తెచ్చుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: