హైదరాబాద్:‘రాజు మంచివాడయితే రాజ్యం బాగుంటుందంటారు’. రాజ్యాన్ని పరిపాలించే వాడి గీత బాగులేకుంటే ఆ రాజ్యంలోని ప్రజలూ బాగుండరు. దీనికి నిదర్శనమే...రాష్ర్టాన్ని సుదీర్ఘంగా ఏలిన చంద్రబాబు, ప్రస్తుత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే. రాష్ర్ట చరత్రలోనే అత్యధికంగా సీఎంగా పనిచేసిన చరిత్ర చంద్రబాబుకు వుంది. 1995నుంచి 2004వరకు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. ఆయన పని చేసిన తొమ్మిదేళ్లు రాష్ర్టం కరవు, కాటకాలతో అల్లాడిపోయింది. ఎన్నడూ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. చెరువులు, కుంటలు నిండిన పాపాన పోలేదు. ఆ తొమ్మిదేళ్లు సాగు నీటికే కాదు, తాగు నీటికి ప్రజలు పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు కన్న ఊరును వదిలి పొట్ట చేత పట్టుకుని బతుకు దెరువు కోసం బొంబాయి, దుబాయ్ వంటి ప్రాంతాలకు పోయేటట్టు చేసింది. పొలాలు బీడుబడ్డాయి. చెరువులు, కుంటలు సర్కార్ తుమ్మ చెట్లతో నిండిపోయాయి. ఇక చేతి వ్రుత్తుల సంగతి సరే సరి. పశుగ్రాసం దొరకక తమ ఇంటి దేవతగా రైతన్న భావించే పశువులను కబేరాలకు పంపించాడు. ఆయన పరిపాలించిన తొమ్మిదేళ్లు కరువుతో ఈ రాష్ర్ట ప్రజలు క్షణం ఒక యుగంగా బతుకు వెళ్లదీశారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి (కడప) సీఎం అయ్యాడు. ఐదేళ్లు బాగానే వర్షాలు కురిసాయి. ఆయన మరణాంతరం బాధ్యతలు చేపట్టిన రోశయ్య (గుంటూరు)హయాంలోనూ భారీగానే వర్షాలు పడ్డాయి. ఆయన తరువాత బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి(చిత్తూరు)హయాంలోనూ మళ్లీ చంద్రబాబు నాటి పాలనను గుర్తుకు తెస్తోంది. 2010 సంవత్సరం చివరి అంకంలో కిరణ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు. 2011లో చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. ఈ ఏడు తీసుకుంటే వర్షా కాలం ప్రారంభమై 20రోజులు దాటింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రోహిణి కార్తెకూడా పోయింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రైతన్న ఆకాశం వంక మేఘాల వైపు ఎదురు చూస్తున్నాడు. ఖరీఫ్ కోసం రైతన్న సర్వంసిద్ధం చేసుకున్నాడు.930రూపాయలకు దొరకాల్సిన బీటీ రకం పత్తి విత్తనాలను బ్లాక్లో రెండున్నర వేల రూపాయలు పెట్టి కొన్నాడు. వర్షం కురువక పోతదా, విత్తనం విత్తక పోతనా అని ఎంతో ఆశతో ఉన్నాడు. కానీ, నిరుడు మాదిరిగానే అన్నదాత ఆశలన్నీ అడియాసలుగానే అవుతున్నాయి. రాష్ర్టంలో ఎక్కడా కూడా ఖరీఫ్ కోసం భూముల్ని సాగు చేసుకుని, విత్తనాలు విత్తు కొనే విధంగా వర్షాలు పడలేదు. దీనితో ఇప్పుడు ఎక్కడా చూసినా చిత్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు సీఎంలు అయితే వర్షాలు పడవా?అంటూ చర్చించుకుంటున్నారు. నలుగురు రైతులు కలిస్తే చాలు చిత్తూరొళ్లు సీఎంలు అయితే పరిస్థితులు అంతేనంటూ పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి, రోశయ్య పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత సీఎం కిరణ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరి నోట వెంట వచ్చేది ఒక్కటే. సీఎంగా చిత్తూరు వాళ్లు ఉంటే వర్షాలు పడవు. కరవుతో అల్లాడిపోవల్సిందేనంటూ మాట్లాడుకుంటున్నారు. యాధ్రుచ్చికమో, ఏమో కానీ, మొత్తానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వర్షాలు లేవు. కిరణ్ కుమార్ సీఎం అయ్యాక చెప్పుకోదగ్గ విధంగా వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఇప్పుడంతా ఇదే హాట్ హాట్ టాఫిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి