మనిషికి సంతోషం కావాలి..ఇంకా చెప్పాలి అంటే అది అందరి హక్కు. ఒకరిని సంతోష పెట్టగలిగే తత్వం మనలో ఉండాలి కానీ, ఒకరిని బాధ పెట్టకూడదు. ఈ విషయం చాలా మందికి తెలిసి కూడా ఇతరులను బాధ పెట్టడానికి రెడీగా ఉంటారు కొందరు. అయితే నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే కొందరిని వదిలి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఎవరెవరికి దూరంగా ఉండాలో?  తెలుసుకోవడం ఎలానో? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ముఖ్యంగా ఆడవాళ్ళను చులకనగా చూసే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో స్నేహం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అమ్మాయిల మీద తప్పుడు అభిప్రాయం ఉండి, వారి మీద కామెంట్లు చేస్తూ ఉండే వారితో స్నేహం అసలు చేయకూడదు. నీ మనసును నాశనం చేయడంలో ఇలాంటి వారు ఎప్పుడూ ముందుంటారు.. ఇలాంటి వాళ్ళకి ఆడ,మగ అనే తేడా ఎప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా మనుషుల్ని మనుషులుగా చూడడం ఇలాంటి వాళ్లకు తెలియదు. కాబట్టి వీళ్లకు దూరంగా ఉండటం మంచిది..

ఇక అహం..నేను చెప్పిందే కరెక్ట్, ఎవరు చెప్పినా  వినను..దేన్ని నేను ఒప్పుకోను అనే వారితో స్నేహం చేయకూడదు. ఎందుకంటే  ఎప్పుడూ  మిమ్మల్నే తప్పుగా చూపుతూ, మీ మీద మీకు చిన్నచూపు కలిగేలా చేయడంలో వీరు ముందు ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళతో స్నేహం మానేయండి..

అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుతూ, ఒక పనిలో ముందుకు వెళ్ళలేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ, ఏ పని చేతకాని వారితో స్నేహం చేయకండి. ఎందుకంటే ఇలాంటి వారు చంచల స్వభావం కలిగి ఉంటారు కాబట్టి.   ఇక ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీలో వున్న ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు..

పైశాచిక ప్రభావం కల వారికి దూరంగా ఉండాలి.వీరు అవతలివాళ్ళు మంచిగా వుంటే తట్టుకోలేరు. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ అవతలివారు చెడుని కోరుకుంటారు కాబట్టి వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


ఇతరుల ప్రవర్తన బాగా లేదని తెలిసినప్పుడు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అవతలివాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని, అది మీకు హానికరం అని అనిపించినప్పుడు వెంటనే వారికి దూరంగా ఉండాలి. లేదంటే అబద్దాలు చెప్పే వారు, మీకెన్ని చెప్పిన మరో అబద్ధం చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.. జీవితంలో ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండగలిగితే మనం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాము..


మరింత సమాచారం తెలుసుకోండి: