వర్షాకాలంలో లేదా ఇంట్లోనే వాష్ రూమ్స్  ఉండడం కారణంగా , సహజంగా ఆ ఇంట్లోకి జెర్రిలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో కొన్ని సందర్భాలలో మాత్రమే ఈ జెర్రీ ఇంట్లోకి రావడం గమనిస్తూ ఉంటాము. అయితే ఇప్పటికీ కొంత మంది ఈ జెర్రి ఇంట్లోకి వస్తే అశుభం అని, వాటిని ఇంట్లోనే చంపేస్తూ ఉంటారు. అయితే వీటిపై పరిశోధకులు జరిపిన పరిశోధనల మేరకు కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవేమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..సాధారణంగా కొంతమంది ఈ జెర్రి పేరు వినగానే భయపడిపోతుంటారు. అంతేకాకుండా కొంతమందికి ఒళ్ళు గగుర్పొడచడం, శరీరంపైన గూస్ బంప్స్  రావడం జరుగుతుంది. అయితే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో రాళ్ళకింద చేరుకుంటాయి. ఒకవేళ అలా రాళ్ల కిందకు నీరు చేరినప్పు,డు అక్కడ నుండి మరొక ప్రదేశానికి వెతుక్కోవడం జరుగుతుంది . అలా వేరే ప్రదేశానికి వెళుతూ, అనుకోకుండా ఇంట్లోకి రావడం మనం గమనించవచ్చు. అయితే అలా ఇంట్లోకి వచ్చిన వాటిని నెమ్మదిగా బయటకు తీసి వేయాలే తప్ప చంపకూడదు అని అంటున్నారు పరిశోధకులు.అయితే  జెర్రీ ఇంట్లోకి రావడం మంచిదే నట. ఇలా ఎందుకంటున్నామంటే, ఇవి ఇంట్లో ఉండే హానికర కీటకాలను, పురుగులను ఇవి తింటాయి. కాకపోతే చీకటి ప్రదేశాలలో , చెప్పులు, షూస్ లోపల వుండి,మనకు కట్టడంతో తర్వాత నొప్పి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇకపోతే ఈ జెర్రి ని చంపడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. పైగా వీటిని చంపుకుంటూ పోతే భవిష్యత్ కాలాలలో అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా ఎంత పెద్ద జెర్రి  కుడితే నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుట్టినచోట ఎర్రగా అవుతుంది. మరి కొంతమందికి జ్వరం వికారం వంటివి కనిపిస్తాయి. అంతే కానీ ప్రాణాలు పోవు. కానీ 1932 వ సంవత్సరంలో మాత్రమే ఒక వ్యక్తి జెర్రీ కుట్టడం వల్ల చనిపోయాడు అని వైద్యులు తెలిపారు.అయితే జెర్రీ కుట్టిన ప్రదేశంలో వేడినీటితో శుభ్రం చేసి, ఆ తర్వాత ఐస్ ముక్కలతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీటిని ఇంట్లోకొస్తే నెమ్మదిగా బయటకు తోసివేయాలే తప్పా చంపకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: