సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తులపై ట్రోల్స్ జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లు ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రాజమౌళి ఒకరు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు పరిశ్రమలో మరియు ఇండియా వ్యాప్తం గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా వారణాసి అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

నిన్న ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమరన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ కి సంబంధించిన ఒక పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పోస్టర్లో పృథ్వీరాజ్ ఒక వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. అతని చెర్ కి చుట్టూ చేతులు లాంటివి ఉన్నాయి. దీనితో అనేక మంది రాజమౌళి ఈ పోస్టర్ను ఆ సినిమా నుండి కాపీ కొట్టాడు. ఈ సినిమా నుండి కాపీ కొట్టాడు. అంటూ అనేక మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇకపోతే రాజమౌళి సినిమాల నుండి కొన్ని సన్నివేశాలను , పాత్రలను కాపీ కొట్టడం అనేది ఇది మొదటి సారి ఏమీ కాదు.

ఆయన గతంలో రూపొందించిన అనేక సినిమాలలో అనేక సన్నివేశాలను చాలా సినిమాల నుండి కాపీ కొట్టాడు. కానీ ఆయన కాపీ కొట్టినా కూడా ఒరిజినల్ మూవీలో ఉన్న దాని కంటే అద్భుతంగా దానిని చూపిస్తూ ఉంటాడు. దానితో ఆయన కాపీ కొట్టిన కూడా జనాలు దానిని ఎంతో ఆనందిస్తూ చూస్తారు. దానితో అనేక మంది రాజమౌళి "వారణాసి" సినిమాలో పృథ్వీరాజ్ పాత్రను ఏదైనా మూవీ నుండి కాపీ కొట్టిన దానిని అద్భుతమైన రీతిలో చిత్రీకరిస్తాడు. ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాడు అని ఎంతో మంది గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: