పూర్వం ఒకరాజు గారు ఉండేవారు.ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు.ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన భాదలతోను,విచారంతోను కన్పిస్తూ ఉండేవారు.కాని సంతోషంగా నున్న వారెవ్వరూ కన్పించేవారు కాదు."వీళ్ళని సంతోష వంతులుగా చేయడమెలాగ?నా రాజ్యంలో ఒక్కడూ,సంతుష్టిగా,సంతోషంగా ఉండే మనిషే లేడా?"అని ఎంతగానో బాధపడేవాడు.ఎప్పుడూ ఆయన యీ విషయాన్ని గురించే ఆలోచిస్తుండేవారు.


ఒకరోజు అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు.ఒక చోట ఆయనకు ఒక ముసలి తాత కన్పించాడు.అతడు పొలంలో గోతులు త్రవ్వి మొక్కలు నాతుతున్నాడు.అతడు వాటిని ఎంతో ఓపికగాను,శ్రద్ధగానునాతుతున్నాడు.అతన్ని చూచిన రాజు గారికి చాల సంతోషమనిపించింది.రాజుగారు అతని వద్దకు వెళ్ళి "తాత ఏమిటి పాతుతున్నావు?" అని అడిగారు.రాజుగారి ప్రశ్నకు జవాబుగా "అయ్యా! నేను మొక్కలను నాతుతున్నాను" అన్నాడు.


'ఆ చెట్లు ఎన్నేళ్ళకు కాస్తాయి' అని రాజు ముసలి తాతని ప్రశ్న వేశారు.'సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు" అని ముసలి తాత జవాబు ఇచ్చాడు.అప్పుడు రాజు తాతతో 'తాత ఈ వయసులో ఎందుకు ఇంత కష్టపడుతున్నావు?నీకు వయసు ముదిరి పోయిoది కదా!వీటి కాయలు తినడానికి నీవు మరొక ఐదు,ఆరేళ్ళు జీవిస్తావా' అని అడుగుతాడు.అప్పుడు ముసలి తాత 'మహారాజ ఇవి నా కోసం కాదు.నా మనుమల కోసం నాటుతున్నాను.మా తాతలు పూర్వం ఇలా మా తాతలు చెట్లను నాటారు కాబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను' అని సమాదానం చెబుతాడు ముసలి తాత.రాజు గారికి అప్పుడు ఎంతో అనందం కల్గింది.'కనీసం ఈ ఒక్కడైన నా రాజ్యంలో సంతుష్టిగా,సంతోసంగాను ఉన్నాడు' అనుకోని వెళ్ళిపోయాడు.తరువాత ఆయన ఆ రాజుగారు ముసలి తాతకి అనేక బహుమతుల్ని పంపించారు.ఈ కథ వల్ల నీతి ఏమిటంటే  ఉన్న దానితో తృప్తి ఉంటే ఏ పరిస్థితిల్లో ఐన సంతోషంగా ఉంటారు.ఈ కాలంలో అందరు పెద్ద పెద్ద వస్తువుల కోసం ఆశ పడుతూ చిన్న చిన్న ఆనందాలకు దూరం అవుతున్నారు. ఉన్న దానితో సంతోషంగా ఉంటే ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: