ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ పటిష్టమైన జట్టుగా ఉన్నప్పటికీ ఇక పాకిస్తాన్లో ఉగ్రవాదం కారణంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా మొన్నటి వరకు ఆ దేశ పర్యటనపై నిషేధం విధించాయి అని చెప్పాలి. 2009లో ఉగ్రదాడి తర్వాత ఇక అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకుంటూ నిషేధం విధించాయి.   దీంతో ఎన్నో ఏళ్లపాటు ఏకంగా పాకిస్తాన్ సొంత దేశంలో క్రికెట్ ఆడలేకపోయింది. విదేశీ జట్లతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాలి అంటే యూఏఈ వేదికగానే వరుసగా సిరీస్ లు ఆడుతూ ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం వరుసగా అన్ని విదేశీ జట్లు పాకిస్తాన్  పర్యటనకు వెళ్తున్నాయ్.


 దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇలా పాకిస్తాన్లో విదేశీ జట్లు పర్యటిస్తున్న నేపథ్యంలో ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే 17 ఏళ్ల నిషేధం తర్వాత ఇక ఇప్పుడు పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది ఇంగ్లాండు జట్టు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. బెన్ స్టోక్స్ సారధ్యంలో బరిలోకి దిగబోతున్న ఇంగ్లాండ్ జట్టు ఎలా రాణించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.



 ఏకంగా పాక్ గడ్డపై ఆతిథ్య పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి తాను పొందే ఫీజు మొత్తాన్ని కూడా పాకిస్తాన్ ఫ్లడ్ రిలీఫ్ కు డొనేట్ చేస్తున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ప్రకటించాడు. తాను ఇచ్చిన విరాళం ద్వారా వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కొంతైనా మార్పు వస్తుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. నీ నిర్ణయంతో అభిమానులను గర్వపడేలా చేసావ్ అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: