టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సాయి పల్లవి పేరు సంపాదించింది. అయితే ఇప్పుడు తమిళ అభిమానులను ఫీల్ అయ్యేలా చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కళా రంగంలో విశిష్ఠ సేవలు అందించిన వారికి తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డులు ప్రకటించారు. ఇందులో ఎస్ జె సూర్య, సాయి పల్లవి, అనిరుధ్, లింగుస్వామి, సింగర్ శ్వేత, మోహన్ లాల్ మరికొంతమందికి ఈ అవార్డులు ప్రకటించారు. అయితే ఈ అవార్డులు ఎంపిక చేసినందుకు చాలామంది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కానీ ఈ అవార్డు ఎంపిక చేసినందుకు సాయి పల్లవి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తమిళ ఫాన్స్  ఈమె పైన కోపంగా ఉన్నారు. ఈమధ్య సాయి పల్లవిని చాలా మిస్ అవుతున్నామని.. అమరన్ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కూడా నటించడానికి ఒప్పుకోలేదని తెలుపుతున్నారు.ఇటీవలే శింబు 49 చిత్రం కోసం డైరెక్టర్ వెట్రిమారన్ సంప్రదించినా కూడా ఆమె నో చెప్పినట్లు వినిపించాయి. అలా నో చెప్పడానికి ముఖ్య కారణం హీరో శింబు తో సినిమా అంటూ అప్రోచ్ అవ్వడం వల్లే నో చెప్పిందనే టాక్ తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించాయి.


దీంతో కోలీవుడ్ నుంచి సాయి పల్లవి దూరంగా ఉండడానికే ఇలా చేస్తోందా? అనే డిస్కషన్స్ ఇప్పుడు ఆడియన్స్ లో మొదలయ్యింది. తెలుగులో ఈ ఏడాది తండేల్ సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ,రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం.అలాగే అమీర్ ఖాన్ కొడుకు హీరోగా వస్తున్న "మేరే రహో గా" అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ కు కావాలనే దూరమవుతోందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయాల పైన సాయి పల్లవి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: